ETV Bharat / state

చనిపోతున్నానంటూ వాట్సాప్​లో ఎస్సై సందేశం.. పోలీసుల గాలింపు

కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్సై విష్ణునారాయణ వాట్సప్‌ సందేశం కలకలం రేపింది. తాను ఆత్మహత్యకు పాల్పడబోతున్నట్లు శనివారం రాత్రి పోలీసు గ్రూపులో ఎస్సై పోస్టు చేశారు. ఆ సందేశం చూసిన ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు.. విష్ణునారాయణ ఇంటికి వెళ్లి సముదాయించారు. అనంతరం ఉదయం 4 గంటలకు ఎస్సై విష్ణునారాయణ కారులో బయటకు వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

kunool district rudravaram si suicide post in whatsup
చనిపోతున్నానంటూ ఎస్సై వాట్సాప్ సందేశం
author img

By

Published : Mar 1, 2020, 10:54 AM IST

చనిపోతున్నానంటూ ఎస్సై వాట్సాప్ సందేశం

క్రమశిక్షణా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ పకీరప్ప రెండు రోజుల క్రితం రుద్రవరం ఎస్సై విష్ణునారాయణను జిల్లా పోలీసు కేంద్రానికి పిలిపించారు. ఈ విషయంలో మనస్థాపానికి గురైన ఆయన పోలీసు వాట్సాప్​ గ్రూపులో ఒక సందేశం ఉంచారు. 'ఈ సందేశం చూసే లోపు తాను బతికుంటానో లేదో తెలియదని.. తన కుటుంబాన్ని కాపాడాలని' పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు శుక్రవారం అర్ధరాత్రి రుద్రవరంలోని ఎస్సై ఇంటికి వెళ్లి ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోని విష్ణునారాయణ అంతవరకు తన వెంట ఉన్న కానిస్టేబుల్​ను ఇంటికి పంపించి.. వేకువజామున 4 గంటలకు తన సొంత కారులో ఎటో వెళ్లిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సై కోసం గాలింపు చేపట్టారు.

ఇవీ చదవండి.. వానరానికి మనిషి సహాయం..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.