- ప్రశ్న: కర్నూలు మెడికల్ కళాశాలలో ఇప్పటికే ఫ్లాస్మ థెరపి చేస్తున్నారు. వెంటిలేటర్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు ?
- జవాబు: కర్నూలు మెడికల్ కళాశాలలో తగినన్ని పడకలు ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలను స్టేట్ కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. పాజిటివ్ కేసులు
గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకు జిల్లాలో 6 వేల కేసులు నమోదయ్యాయి. శాంతిరాం మెడికల్ కళాశాల, విశ్వభారతి మెడికల్ కళాశాలకు కేసులు వస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తవేసిన తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలతో కేసులు ఆదోని ప్రాంతంలో పెరిగాయి. వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్న వారితో కొద్దిగా సమస్య ఉంది. ఒకటి రెండు రోజుల్లో కోలుకోలేక చనిపోయిన వారు ఉన్నారు. ఆక్సిజన్ సరఫరా, పడకలు పెంచేందుకు
ప్రయత్నం చేస్తున్నాం.- డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న: వందల సంఖ్యలో కేసులు వస్తున్నాయి కదా.. ఇంత మందికి సరిపడా పడకలు ఉన్నాయా..? మెడికల్ కళాశాలలో పరిస్థితి ఎలా ఉంది ?
- జవాబు: ఇప్పుడు కాస్త ఫర్వలేదు. రానురాను సమస్య ఏర్పడే అవకాశముంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన విధంగా ప్రత్యామ్నాయ పడకలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది. - డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న: ఆక్సిజన్ సౌకర్యం ఎన్ని బెడ్స్‌కు ఉంది..? ఎలాంటి రోగులకు ఆక్సిజన్ ఇస్తున్నారు?
- జవాబు: 1200 బెడ్స్ వరకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. కేసులు పెరగకుండా జిల్లాలో ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు. సీరియస్‌గా ఉన్న వారికి ఆక్సిజన్ ఇస్తున్నాం. అవసరం ఉన్నవారికి ఐసీయులో చికిత్స అందిస్తున్నాం. - డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న: ఎంత మందికి పరీక్షలు చేస్తున్నాం ?
జవాబు: కర్నూలు జిల్లాలో ఉన్న మూడు ల్యాబ్‌ల్లో 5 వేల పరీక్షలు చేస్తున్నాం. ఆర్టీపీసీఆర్
పరీక్షలు 3 వేల నుంచి 3500 వరకు, ట్రూనాట్ 500, యాంటిజిన్ కిట్స్ వచ్చాయి. వృద్ధులపై దృష్టి పెట్టాం. - డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న: లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే వైద్యం పొందుతున్న వారు ఎంత మంది ఉన్నారు?
జవాబు: హోం క్వారటైన్‌ను ప్రోత్సహిస్తున్నాం. 50 నుంచి 100 మంది రోగులు ఇలా ఉన్నారు. లక్షణాలు ఎక్కువైతే వారిని ఆసుపత్రికి తరలిస్తున్నాం. ఇది అడిషనల్ డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో జరుగుతుంది.- డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న: ప్లాస్మా థెరపీని సర్వజన వైద్యశాలలో ప్రారంభించారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
జవాబు : ప్లాస్మా థెరపికి ఐసీఎంఆర్ ఆనుమతి వచ్చింది. కొవిడ్ నుంచి కోలుకున్న కొద్ది
మంది ప్లాస్మ డొనేట్ చేశారు. సేకరించిన ప్లాస్మను రోగులకు ఇచ్చాం వారు రికవరి స్టేజ్‌లో
ఉన్నారు. - డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న: ప్లాస్మా థెరపికి డోనర్స్ తక్కువగా వస్తున్నారు ఎందుకు ?
జవాబు: ప్రజల్లో కొద్దిగా అవగాహన ఉండాలి. మేము ప్రోత్సహిస్తున్నాం. కొవిడ్ నుంచి
రికవరీ అయిన తరువాత మరలా పరీక్షలు నిర్వహించి యాంటిబాడీస్ ఉంటే అలాంటి ప్లాస్మ మనం సేకరిస్తున్నాం. - డాక్టర్ చంద్రశేఖర్
- ప్రశ్న : కర్నూలు జిల్లా ప్రజలకు ఏం చెబుతారు?
జవాబు : ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అధైర్య పడాల్సిన అవరసరం లేదు. మాస్క్
ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. శానిటైజర్ ఉపయోగించాలి. గుంపులుగా ఉండకూడదు. ప్రజల్లో సెల్ఫ్ డిసిప్లేన్ ఉండాలి. కోలుకున్న వారు ప్లాస్మ డొనేట్ చేస్తే ప్రాణదాతలవుతారు.- డాక్టర్ చంద్రశేఖర్
ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్