కర్నూలు జిల్లా నంద్యాలలో జేవీసీ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక్కో సభ్యుడి దగ్గర నెలకు రూ.10 వేలు వసూలు చేశాడు లక్కీ డిప్ నిర్వాహకుడు. స్కీం పూర్తైన తరువాత సభ్యులకు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో భాదితుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో శీగు శ్రీనివాసులు అనే బాధితుడు డీఎస్పీ కార్యాలయం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. నెలకు రూ. 10 వేల చొప్పున దాదాపు నాలుగు లక్షల రూపాయలు చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. స్కీమ్ నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు శ్రీనివాసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీచూడండి కొడవటికల్లులో రైతుకు పాముకాటు