కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి దిగుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మార్కెట్లోఉన్న షెడ్లన్ని ఉల్లి నిల్వలతో నిండిపోయాయి. బుధవారం ఒక్క రోజే మార్కెట్‌కు 20 వేల క్వింటాళ్లు రాగా... అందులో ఆరు వేల క్వింటాళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉల్లికి కర్నూలు మార్కెట్లో మంచి ధర ఉండటంతో రైతులు భారీగా ఉల్లిని తీసుకువస్తున్నారు. నాలుగురోజులైనా ఉల్లిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.. వరుసగా సెలవులు ఉండటంతోపాటు ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉండటంతో రైతులు మార్కెట్‌కు సెప్టెంబర్ 3 వరకు తీసుకురావద్దనివ్యవసాయ మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి సూచించారు.
ఇదీచూడండి.అన్నదాతకు విత్తు కష్టాలు.. కడతేరుస్తున్న క్యూలైన్లు