కన్నడ సినీ నటి మీనాక్షి కర్నూలులోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాన్ని దర్శించుకున్నారు. మంచాలమ్మ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి నిరంజన్ రావు, దేవాదాయ శాఖ ముఖ్య అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తదితరులు స్వామి వారి దర్శనార్థం వెళ్లారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి..తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇదీ చదవండి: తిరుమలపై నివర్ ప్రభావం.. దర్శనాలకు అంతరాయం