రాష్ట్రాన్ని న్యాయవ్యవస్థే కాపాడుతుందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ గౌరవం ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందని.., న్యాయవ్యవస్థను సైతం తమ చేతుల్లో ఉంచుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. అందుకే హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వైకాపా దౌర్జన్యాలకు భయపడమని.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. తమ కుటుంబం ప్రజల ఆశీస్సులతో 68 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతోందని వెల్లడించారు.
ఇదీచదవండి