కర్నూలు జిల్లా బనగానపల్లెలో జవాన్ నాయక్ దళాలు షఫీ (30)కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. షఫీ ఈనెల 30న ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. పార్థివదేహాన్ని దిల్లీ నుంచి స్వస్థలం బనగానపల్లెకు తరలించారు. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఇతర అధికారులు పార్థివదేహానికి నివాళులర్పించారు.
పాత బస్టాండ్ సమీపంలోని జుమ్మా మసీదుకు మృతదేహాన్ని తీసుకెళ్లి ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి సర్కిల్ కార్యాలయం మీదుగా.. పార్థివదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. స్థానిక ప్రముఖులు కాటసాని ఓబుల్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి.. కార్యక్రమానికి భద్రత కల్పించారు.
ఇవీ చూడండి: