నందికొట్కూరులో వైకాపా అభ్యర్థి తోగురు ఆర్థర్ నామినేషన్ వేశారు. అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు.
శ్రీశైలం వైకాపా అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజలంతా తమవైపే ఉన్నారని.. జగన్ సీఎం కావడం తథ్యమని విశ్వాసం వ్యక్తంచేశారు.
ఆదోనిలో తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీనాక్షి నాయుడు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న నూర్ అహ్మద్, ఫయాజ్ అహ్మద్‌లు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
పత్తికొండ తెదేపా అభ్యర్థి కె.ఈ. శ్యాంబాబు నామినేషన్ వేశారు. తండ్రి ఉపముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి, బాబాయ్ ప్రతాప్‌తో కలిసి వచ్చి నామపత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేశారు.
ఇవిచదవండి