జగనన్న పచ్చతోరణంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్పీజీ పాఠశాల మైదానంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి మొక్కలు నాటారు. గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి మనిషికి 28 మొక్కలు మాత్రమే ఉన్నాయని, ఈ సంఖ్య పెరగాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డిఎఫ్ఓ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలను సంరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చదవండి: కృష్ణాప్రవాహం పెరగటంతో జూరాల నుంచి నీటి విడుదల