YSRCP leaders Internal fight in AP: గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వైసీపీలో కార్యకర్తలు, నాయకుల నుంచి పార్టీకి తిరుగుబాటు సెగ తగులుతోంది. ఆధిపత్య పోరుతో కొన్ని నియోజకవర్గాల్లో ఎదురు తిరిగితే.. మరికొన్ని చోట్ల అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తమ ప్రాంతం కాని ఎమ్మెల్యే తమపై పెత్తనాన్ని నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు తమ గళం విప్పుతున్నారు. ఇలాంటి సందర్భంలో కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు నిర్వహించిన సమావేశంలో లుకలుకలు బయటపడ్డాయి.
కర్నూలు జిల్లాతో పాటుగా.. కోడుమూరు నియెజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కర్నూలు, కోడుమూరు నియెజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో రెండు చోట్ల ఆయా నాయకుల సమావేశంలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ, మోహన్ రెడ్డి వర్గీయులు సభ ముందుకు వచ్చి తమకు అన్యాయం జరుగుతుందని.. మట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి స్వయంగా సముదాయించినా కార్యకర్తలు మాట వినలేదు.
కోడుమూరు నియెజకవర్గానికి సంబంధించిన అంతర్గత కార్యకర్తల సమావేశం ఏ టూ జెడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సుదాకర్, కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కో ఆర్డినేటర్లు అమర్నాథ్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కర్నూలు మేయర్ బీవై రాయమ్య పాల్గొన్నారు.
ఇవీ చదవండి: