కర్నూలు జిల్లా ఆదోనిలో సినిమా థియేటర్లను ఆర్డీవో బాల గణేశయ్య తనిఖీ చేశారు. సినిమా క్యాంటీన్లలో నాణ్యమైన వస్తువులు విక్రయించాలని, శుభ్రత పాటించాలి యజమానులకు . అధిక ధరలకు సినిమా టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. థియేటర్లో వాహనాల పార్కింగ్‌కు రూ. 20 వసూలు చేస్తున్నారని తమకు సమాచారం ఉందని, మరోసారి ఫిర్యాదులు వస్తే సినిమా హాళ్లను సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి.