శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి 85,098 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 816.40 అడుగులకు చేరుకుంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 38 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 3.264 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
ఇదీ చదవండి:
cbn on gazette: 'జలశక్తి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం'
krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు