ETV Bharat / state

Kottam Badi in Kurnool : మా బడి మాకు కావాలి.. కర్నూలులో పూర్వ విద్యార్ధుల పోరాటం

Kottam Badi in Kurnool : ఏళ్ల తరబడి ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల అది. మురికివాడలోని పిల్లలతో ఓనమాలు దిద్దించి ఉన్నత విద్యావంతులుగా మార్చిన ఆ బడి ఆక్రమణకు గురైంది. తమను ఉన్నతస్థానంలో నిలబెట్టిన పాఠశాలను కాపాడుకునేందుకు పూర్వ విద్యార్థులు, స్థానికులు ఏకమయ్యారు. కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌లోని ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి కాపాడుకోవాలని సంకల్పించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 10, 2023, 12:38 PM IST

కొట్టం బడి పూర్వ విద్యార్థులు

Kottam Badi in Kurnool : కర్నూలులోని ఇందిరాగాంధీ నగర్, ఇల్లూరు నగర్, పీవీ నరసింహారావు నగర్ ప్రాంతాల్లో నిరుపేదలు, రోజువారీ కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంత చిన్నారులకు చదువు చెప్పించాలన్న లక్ష్యంతో... 1970లో స్థానికులు ప్రభుత్వ స్థలంలో పాఠశాల ఏర్పాటు చేసుకున్నారు. రోజ్ మండ్ అనే మహిళ సేవా భావంతో ముందుకు రావటంతో... ఆమెనే ఉపాధ్యాయురాలిగా నియమించుకున్నారు. క్రమంగా ఈ పాఠశాలను ప్రభుత్వం గుర్తించి... ఎయిడెడ్ పాఠశాలగా మార్చించి. బడిలో ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. స్థానికంగా ఉన్న చిన్నారులంతా ఇక్కడే చదువుకున్నారు. అయితే 2006లో రోజ్‌మండ్‌ ఈ పాఠశాలను నివాస స్థలంగా పట్టా తెప్పించుకున్నారు. దీంతో ఎయిడెడ్ పాఠశాలలకు నిధులు నిలిపివేయటంతో బడి మూతపడింది. ఇప్పుడీ స్థలంపై కొందరి కన్నుపడింది. బడి స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తుండటంతో పూర్వ విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బడి మాకు కావాలంటూ నడుం బిగించారు.

అక్రమంగా పట్టా చేయించుకున్న టీచర్.. ఎన్నో ఏళ్లుగా దీన్ని కొట్టం బడి అని పిలేచేవారు. ఇందులో వందలాది మంది చిన్నారులు విద్యను అభ్యసించారు. స్కూలు మూతపడటంతో... ఆ స్థలం తమదేనని దానికి పట్టాలు ఉన్నాయని రోజ్ మండ్ కుమార్తెలు వేరొకరికి విక్రయించారు. తాము ఇందులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామని కొనుగోలు చేసిన వ్యక్తులు రావటంతో స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఎలా విక్రయిస్తారని కలెక్టర్‌, తహసీల్దార్​కు వినతిపత్రాలు అందజేశారు.

1970 దశకంలో... 50 సంవత్సరాల కిందట వీధి ప్రజలంతా కలిసి కొట్టం ఏర్పాటు చేశాం. గ్రామ కంఠం స్థలంలో గుడి కట్టాలనుకుని చివరకు బడి ఏర్పాటు చేశాం. వీధిలో పేద పిల్లలంతా ఇక్కడకు వచ్చి చదువుకునేవారు. అప్పుడు రోజ్ మండ్ అనే మహిళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పిల్లలకు పాఠాలు బోధించేది. ఆ తర్వాత హరిజన సేవా ఎడ్యుకేషన్ కమిటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటం చేయగా.. కాల క్రమంలో ఎయిడెడ్ స్కూల్ గా మారింది. 2006లో ఆ స్థలాన్ని రోజ్ మండ్ చాలా రహస్యంగా నివాస ప్రాంతంగా పట్టా చేయించుకోవడంతో నిధులు నిలిచిపోయాయి. నిధుల్లేక, టీచర్లు కూడా లేకపోవడంతో స్కూల్ మూతపడింది. కానీ, రోజ్ మండ్ స్థలాన్ని తమకు విక్రయించారని కొందరు వ్యక్తులు వచ్చి కూల్చివేసే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నాం. తమకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు చెప్పడంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశాం. తహసీల్దార్​తో పాటు కలెక్టర్​ను కలిని వినతి పత్రాలు సమర్పించాం. అధికారులు ఇకనైనా జోక్యం చేసుకుని స్థలాన్ని కాపాడాలి. ఆ స్థలంలో బడిని పునరుద్ధరించాలి. లేదంటే గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, సచివాలయం లాంటివి నిర్మించాలి. - స్థానికులు, పూర్వ విద్యార్థులు

కొట్టం బడిని తిరిగి ప్రభుత్వం తెరిపించాలని... లేదంటే గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, సచివాలయం లాంటివి ఏవైనా ఏర్పాటు చేయాలని స్థానికులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.