కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలులోని శరీన్ నగర్‌కు చెందిన వడ్డె కుమార్.. సెబ్ అధికారులు ఏర్పాటు చేసుకున్న అద్దె వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం విధులకు హాజరైన అతను.. అకస్మాత్తుగా తన మిత్రుడు ప్రకాశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై అలంపూర్ కు వెళ్లాడు. మద్యం కొనుగోలు చేసి కర్నూలు వైపు వస్తుండగా సెబ్ అధికారులకు సమాచారం అందింది. అతని వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. 65 మద్యం సీసాలు బయటపట్టాయి. మద్యం, వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు నిందితులను సెబ్ అధికారులు అరెస్టు చేసి.. కర్నూలు అర్బన్ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు.
ఇదీ చదవండి: