కర్నూలు జిల్లా కోడుమూరు హంద్రీ నదిలో ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమార్కులు రాత్రింబవళ్లు ట్రాక్టర్లలలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా వేకువజామున ఎడ్ల బండ్లపై తరలించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. హంద్రీ నదిలో నీటి పథకాలు దగ్గర ఇసుకనూ తవ్వేస్తున్నారు. హంద్రీ ఒడ్డున ఆనుకొని ఉన్న పొలాల్లో ఇసుకను రాత్రివేళలో తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కోడుమూరు పట్టణం ప్రజలు తాగునీటి విషయంలో హంద్రీ నదిపైనే ఆధారపడి ఉన్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలిస్తుంటే భూగర్భ జలాలు అడుగంటి పోయి.. తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. పట్టపగలే ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్న అధికారులు నిద్రావస్థలో ఉన్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇది చదవండి మటన్ వ్యాపారి ఇంట వేడుక... 22 మంది కరోనా