కర్నూలు నగరంలో 40 కిలోల గంజాయిని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా.. పంచలింగాల వద్ద ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిలో చింతపల్లికి చెందిన ఓ మహిళా హోంగార్డు కుమారుడు ఉన్నాడు. పట్టుకున్న సరుకు విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు.
ఇదీ చదవండి: