Kurnool district Bar Association Lawyers Rally: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఏమైందని.. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం లాయర్లు ముఖ్యమంత్రి జగన్‌ని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ నేడు కర్నూలు జిల్లా కోర్టు నుంచి కొండారెడ్డి బురుజు వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భాగంగా మాట తప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం కర్నూలుకు ఇచ్చిన జ్యుడీషియల్ అకాడమీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళగిరికి తరలించడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రికి మంచి సలహాలిచ్చే సలహాదారులు ఎవరు లేరా? అని ప్రశ్నించారు. త్వరగా కర్నూలుకు హైకోర్టును తీసుకుని రావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
పాలకపక్షమే గర్జన ఏర్పాటు చేసింది. జగన్నాథ గట్టుమీద పది ఎకరాలలో సువిశాలమైన భవనం కడితే, డోన్ వరకూ కనపడుతుంది అని చెప్పారు. ఎక్కడండి.. ఎంత ఉత్తరకుమార ప్రగల్భాలంటే ఎవరినీ మోసం చేయటానికి. రాయలసీమకు ఇది చేస్తాం..అది చేస్తామని చెప్పి అన్నీ మోసపూరిత చీకటి జీవోలను విడుదల చేశారు.-దాశెట్టి శ్రీనివాసులు, న్యాయవాది
ఇవీ చదవండి