ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,17,109 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఇప్పటికే జలాశయంలోకి 1,52,065 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 853 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 86.8390 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... నాగార్జునసాగర్ కు 42 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తికి 1400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1688 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు కు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వచ్చి చేరుతున్న వరద జలాలతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంటోంది.
ఇదీ చదవండి:
రాయలసీమ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అక్కర్లేదు: కేంద్ర కమిటీ