కర్నూలులోని వ్యవసాయ అధ్యయన కేంద్రానికి సంబంధించిన 50 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈరోజు వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. వ్యవసాయ అధ్యయన కేంద్రం స్థలాన్ని వైద్య కళాశాలకు కేటాయించటం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ స్థలాన్ని.. ప్రభుత్వమే వైద్య కళాశాలకు కేటాయించిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరు పక్షాలు వాదనలు విన్న ధర్మాసనం... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీచదవండి