ETV Bharat / state

ఘనంగా గుర్రాల పార్వేట వేడుకలు - మద్దికేర గుర్రాల పార్వేటపై వార్తలు

కర్నూలు జిల్లా మద్దికేరలో గుర్రాల పార్వేట వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా గుర్రాల పార్వేట వేడుకలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.

Glorious horse parade ceremonies at madhikera
ఘనంగా గుర్రాల పార్వేట వేడుకలు
author img

By

Published : Oct 25, 2020, 7:56 PM IST

దసరా ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా మద్దికేరలో గుర్రాల పార్వేట వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఈ వేడుకను తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మద్దికేరను పాలించిన యాదవ రాజవంశీకులు పూజలు నిర్వహించిన అనంతరం పార్వేట వేడుకలు మొదలవుతాయి. అనంతరం మూడు వర్గాలకు చెందిన వారు మద్దికెర నుంచి మాజరా గ్రామమైన బొజ్జ నాయునిపేట వరకు గుర్రాల పోటీలను నిర్వహిస్తారు. ఈ వేడుక రాష్ట్రంలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఈ వేడుకను విజయదశమి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇదీ చదవండి: విశాఖ మెట్రోకు వచ్చే నెలలో టెండర్లు:బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.