ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో శ్రీశైలం ఒకటి కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీగిరికి తరలి వస్తారు. కార్తీకమాసం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు మల్లన్న సన్నిధికి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రింగ్ రోడ్డుకు అనుకొని దేవస్థానం రూ. 43 కోట్లతో 224 గదులతో నాలుగు బ్లాక్‌ల సముదాయంగా వసతి సముదాయాన్ని నిర్మిస్తోంది. వాహనాల పార్కింగ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అంతర్గత రహదారులు, పచ్చని చెట్లను పెంచి పార్కింగ్ ను తీర్చిదిద్దనున్నారు.
భక్తులు సైతం గణేష్ వసతి సముదాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగత భక్తులు కూడ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.
నూతన వసతి సముదాయంలో ఒక్కో గదికి దాతల నుంచి 10 లక్షల విరాళం కోరుతోంది దేవస్థానం. విరాళం ఇచ్చిన దాతకు ఏడాదిలో 45 రోజులు ఉచితంగా వసతి కల్పించనున్నారు. దాత తరపున వచ్చే వారికి నామమాత్రం రుసుముతో వసతి గది కేటాయించనున్నారు.
భక్తజన సౌధంగా నిర్మించే గణేష్ సదన్ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని అధికారులు కోరుతున్నారు. నూతన సముదాయంలో విలాసవంతమైన వసతి, రెస్టారెంట్ అన్నీ.. భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఆగస్ట్ నాటికి గణేష్ సదన్ పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానుంది.
ఇవీ చూడండి..ఆపదలో ఉంటే వస్తారు... చేయూతనిస్తారు