ETV Bharat / state

స్నేహితుడి ప్రేయసిపై వేధింపులు.. యువకుడి ప్రాణం తీసిన నగ్న వీడియోలు.. - A friend who killed a friend

Friends who killed a friend: ఓ యువకుడి ఫోన్లో నుంచి అతని ప్రేయసి నగ్న వీడియోలను సంపాదించి వాటితో ఆమెను బ్లాక్ మొయిల్ చేసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యువతి ప్రియుడు మరో స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Friends who killed a friend
Friends who killed a friend
author img

By

Published : Feb 24, 2023, 12:41 PM IST

Friends who killed a friend: తన ఫోన్లోంచి ప్రియురాలి నగ్న వీడియోలు సంపాదించి, వాటితో ఆమెను బ్లాక్ మొయిల్ చేసిన స్నేహితుడిని మరో మిత్రుడితో కలిసి కడతేర్చాడు ఓ యువకుడు. కర్నూలు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు మండలం బాలాజీ నగర్​కు చెందిన ఎరుకలి దినేశ్ డిగ్రీ చదువుతున్నాడు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజుకు చెందిన మల్లెపోగు మురళీకృష్ణ(22) అతనికి స్నేహితుడు. ప్రేయసి నగ్న వీడియోలను దినేశ్ తన ఫోన్లో ఉంచుకున్నాడు. ఆ వీడియోలను మురళీకృష్ణ తన ఫోన్లోకి దినేశ్​కు తెలియకుండా రహస్యంగా పంపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి ఫోన్ చేసి అనేక విధాలుగా వేధించడం మొదలు పెట్టాడు. తాను అడిగింది చేయకపోతే ఈ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెడతానని, కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు.

దీంతో ఆ యువకుడి వేధింపులు తాళలేక యువతి ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిగా ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి దినేశ్.. మురళీకృష్టపై పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. మురళీ కృష్ణను హత్య చేయాలనే విషయాన్ని దినేష్​ మరో స్నేహితుడు కిరణ్​కుమార్​కు వివరించాడు. పథకం ప్రకారం శివమాల ధరించిన మురళీకృష్ణను జనవరి 25న దినేశ్, కిరణ్ కుమార్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నగర శివారులోని పంచలింగాల ప్రాంతానికి తీసుకెళ్లారు. మురళీకృష్ణను అక్కడ అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు.

ఆ తరువాత ఓ ఆటోను ఆద్దెకు తీసుకుని ఆ మృతదేహాన్ని నన్నూరు టోల్ పాల్జా సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పడేశారు. మృతుడి సెల్ఫోన్, దుస్తులను వేర్వేరు చోట్ల పడేసి వెళ్లిపోయారు. కుమారుడి ఆచూకీ కోసం పలు చోట్ల గాలించిన మురళీకృష్ణ తల్లిదండ్రులు.. ఈనెల 16న కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు. ఆ క్రమంలోనే దినేశ్​ను విచారించగా అసలు విషయం తెలిసింది. మృతదేహం కోసం పోలీసులు హంద్రీ- నీవా కాలువలో గాలిస్తున్నారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.