కర్నూలు జిల్లాలో జరుగనున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా... ఎమ్మిగనూరులో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందజేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలింగ్ బూతుల వారీగా సిబ్బందికి... ఎన్నికల అధికారులు సామాగ్రి అందజేశారు.
ఈ క్రమంలో పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కాగినహళ్లి ఫక్కీరప్ప సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు ఎదురవకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 18 మంది డీఎస్పీలు, 35మంది సిఐలతో పాటు 2,800 మంది పోలీసులతో భద్రత చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆదోనిలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదోని మండలంలోని 38 గ్రామ పంచాయతీలకు 136 మంది సర్పంచ్ అభ్యర్థులు, 887 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు.
ఇదీచదవండి.