కర్నూలు జిల్లా చాగలమర్రిలో బుధవారం పట్టపగలే వరుసగా నాలుగు ఇళ్లలో దొంగలు రెచ్చిపోయారు. చాగలమర్రిలోని భూమానగర్లో షరీఫ్, పెద్ద దస్తగిరి, మహబూబ్, నడిపి దస్తగిరి అనే వ్యక్తులు.. తమ తోటలో పూలు కోసేందుకు వెళ్లారు. అదును చూసిన దొంగలు తలుపులు పగలగొట్టి ఇళ్ళలోకి వెళ్లి.. బీరువాలను బలవంతంగా తెరిచి చోరీ చేశారు. బంగారు ఆభరణాలు కనపడుతున్నా వాటిని వదిలేసి.. 4 ఇళ్లలో ఉన్న రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లటం విచిత్రంగా ఉంది.
సమాచారం అందుకున్న సీఐ ఎన్వీ రమణ.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగలు బంగారు ఆభరణాలు వదిలేసి నగదు మాత్రం తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే వీరంతా స్థానికులే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: