కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి వరసలో నిల్చున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు... పైర్లకు రైతులు యూరియా వేస్తున్నారు. ఈ కారణంగా ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు దండిగా దోచుకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని బస్తాకు 50 నుంచి 100 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. వ్యవసాయాధికారులు యూరియా కొరత లేదని చెబుతున్నా... వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడం గమనార్హం.
ఇవీ చూడండి-బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు...