ETV Bharat / state

'నిధులు, విధులు లేని పదవులు వద్దు.... బెస్తలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి' - కర్నూల్​ తాజా వార్తలు

నిధులు, విధులు లేని పదవులు కాకుండా..బెస్తలకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్​ మాజీ డైరెక్టర్ యాటగిరి రాంప్రసాద్ బెస్త డిమాండ్​ చేశారు. గత ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామన్న సీఎం జగన్​.. ఇప్పుడు మాట తప్పారన్నారు. తక్షణమే బెస్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు.

former fishermen  corporation chairman ramprasad bestha
బెస్తలకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
author img

By

Published : Dec 28, 2020, 1:22 PM IST

చట్ట సభల్లో బెస్తలకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్​ మాజీ డైరెక్టర్ యాటగిరి రాంప్రసాద్ బెస్త డిమాండ్​ చేశారు. బీసీల పట్ల ఏపీ ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని అని ఆయన అన్నారు. కర్నూలులో ఆదివారం బెస్త సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్​లకు నిధులు కేటాయించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కేవలం వైకాపా నాయకులకు నామినేటెడ్ పదవుల కోసమే కార్పొరేషన్​లు ఏర్పాటు చేశారా అని ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్​ల వల్ల బీసీ కులాలకు ఎలాంటి మేలు జరుగుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

గత ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని ఇప్పుడు ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం రెండు నెలల మత్స్య కారుల వేట నిషేధం కాలంలో ఇచ్చే మత్స్య కార భరోసా పథకాన్ని రాయలసీమ బెస్తలకు వర్తింపజేయాలని కోరారు. మత్స్య కారులకు మౌలిక వసతులలో కల్పించి.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 40 శాతం సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 శాతం సబ్సిడీ కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెస్తల పట్ల ప్రభుత్వ తీరు మారక పోతే.. రాయలసీమలోని బెస్తలందరం కలసి ఎంతటి పోరాటానికైనా వెనుకాడమని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'పంటలకు మద్దతు ధర కోరుతూ.. తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.