శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆనకట్ట 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. స్పిల్ వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,59,346 క్యూసెక్కులు కాగా....ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 212.91 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 30,595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 1,379 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 35 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్వ వైభవం