కొవిడ్-19పై కర్నూలు జిల్లా అదోనిలో అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. నేటి నుంచి ఉదయం 6 గంటలు నుంచి 9 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చామన్నారు. పట్టణంలో మరో రెండు కేసుల నమోదైన దృష్ట్యా... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విపత్కర పరిస్థితిలో ప్రతిపక్షాలు బాధ్యతయుతమైన పాత్ర పోషించకుండా... ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో కరోనా నమూనాలు సేకరిస్తున్నామని... మన ప్రాంతం వారు ఎక్కడ ఉన్నా రాష్ట్రానికి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. వారికీ కరోనా పరీక్షలు చేస్తామన్నారు. కరోనా విపత్కర సమయంలో విలేకరుల కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కొనియాడారు.
ఇవీ చదవండి....'అండగా ఉంటాం... ఆదుకుంటాం'