కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలోని ఓ కుంటుంబంలో జరిగిన పుట్టు వెంట్రుకల శుభకార్యంలో వాగ్వాదం మొదలైంది. అది కాస్తా... ఘర్షణకు దారితీసింది.
ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. దాయాదులు 2 వర్గాలుగా విడిపోయి గొడవ పడిన ఈ ఘటనలో.. ఏడుగురు గాయపడ్డారు. ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.