మమకారం పంచిన ఆ చేతులే మద్యం మత్తులో విచక్షణ మరిచి కన్నబిడ్డను కడతేర్చాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే గురప్ప అనే వ్యక్తి మద్యం సేవించి తన కుమారుడు శివకృష్ణ (28)తో మత్తులో గొడవ పడ్డాడు.
మాటామాటా పెరిగి కోపోద్రికుడైన గురప్ప.. శివకృష్ణను రోకలి బండతో బాదాడు. తీవ్రగాయపాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శివకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు నంద్యాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: