విద్యుత్ సక్రమంగా సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మద్దికెర విద్యుత్ కేంద్రం ఎదుట అగ్రహారం, ఎడవల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ సరఫరాలో రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ గోడును సంబంధిత విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఈ విషయాన్ని లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య దృష్టికి తీసుకెళ్లగా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి..