కర్నూలు జిల్లా పి.రుద్రవరం గ్రామంలో పేదల ఇళ్ల స్థలాలకోసం కేటాయించిన భూమిని చదును చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకోవాలని ఆందోళన చేపట్టారు. గ్రామంలో దాదాపు నాలుగు వందల ఎకరాలు సేకరించి... ఎకరానికి 18 లక్షల చొప్పున రైతులకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని రైతులు తెలిపారు.
పరిహారం ఇవ్వకుండా భూమిని చదును చేస్తున్నారని రైతులు అడ్డుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ బాలాజీ రైతులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈనెల 8వ తేదీలోపు రైతులకు డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు.