కర్నూలు జిల్లా ఆదోని రైతులనుంచి 4 నెలలు క్రితం నాఫెడ్, మార్క్ ఫెడ్, కేడీసీఎంఎస్ ఆధ్వర్యంలో శనగలు, కందులు కొనుగోలు చేసింది. 15 రోజుల్లో బిల్లులు అందజేస్తామని చెప్పిన అధికారుల ప్రకటన.. ఇప్పటికీ అమలు కావటం లేదు.
ఆదోనికి సంబంధించి 4 కోట్ల రూపాయల బిల్లులు... 656 మంది రైతులకు రావాల్సి ఉందని మేనేజర్ శంకర్ తెలిపారు. మూడు నెలల నుంచి బిల్లుల కోసం 50 కిలో మీటర్ల దూరం నుంచి వస్తున్నామని... ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: