రాష్ట్రంలోనే మదనపల్లె తర్వాత అత్యంత పెద్దదైన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటాకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూలీ ధరలు కూడా రాక చాలామంది పొలంలోనే పంటను వదిలేస్తుండగా.. అష్టకష్టాలు పడి మార్కెట్‌కు తరలించిన రైతులు దళారీల చేతిలో మోసపోతున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై.. ధర తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. స్థానిక నాయకులు, అధికారులు సైతం వ్యాపారులకే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 కిలోల బరువున్న టమోటా గంప కేవలం 80 రూపాయలకు కొనుగోలు చేస్తుండటంతో.. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
ఇదీ చదవండీ.. కదిరిలోని చౌక్ ప్రాంతంలో యువకుడి దారుణ హత్య