కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని ఆర్ పల్లి గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట నష్టపోయిన రైతు అప్పులు తీర్చే మార్గం కనిపించక పరుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేసేందుకు.. నాలుగు నుంచి ఆరు లక్షల వరకు అప్పులు చేశాడని.. తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని బంధువులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: