కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. పొలంలో మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లి షాక్ కు గురై అక్కడికక్కడే మరణించాడు. వర్షం పడి తడిగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి