ETV Bharat / state

మొక్కుబడి తనిఖీలు.. నకిలీలు విత్తుకుంటున్నాయ్‌!

author img

By

Published : May 30, 2021, 9:09 PM IST

ఆకలి తీర్చే రైతు ఏమైతేనేం? కాసులు గలగలమంటే చాలని అక్రమార్కులు భావిస్తున్నారు. నకిలీ విత్తనాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు అధికారులు మొక్కుబడి తనిఖీలు చేపడుతున్నారు. ఫలితంగా అన్నదాతలు వీటిని కొనుగోలు చేసి నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలను విత్తి కోలుకోలేకపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ప్రాణాలే వదులుతున్నారు.

kurnool
జిన్నింగ్‌ మిల్లులను తనిఖీ చేస్తున్న వ్యవసాయశాఖ కమిషనరేట్‌

కర్నూలు జిల్లాలో నకిలీ విత్తనాల బాగోతం చాపకింద నీరులా విస్తరిస్తోంది. వరి, పత్తి, మిరప, కూరగాయలకు సంబంధించిన నకిలీ విత్తనాలను సృష్టించి మార్కెట్‌లో రైతులకు అంటగడుతున్నారు. సాధారణంగా పండించిన చోటే విత్తన కొరత ఉంటుంది. ఈ సమయంలోనే కొందరు దళారులు రైతులను ఆశ్రయించి కొంత విత్తనాన్ని ముందుగా సేకరిస్తారు. డిమాండ్‌ను బట్టి సేకరించిన విత్తనాలకు తోడు నకిలీ విత్తనాలు జోడించి మార్కెట్‌ చేస్తారు. పైగా కంపెనీలు ప్రాసెసింగ్‌ చేసే సమయంలో క్లీన్‌ సీడ్‌ (విత్తనం), రెమినెంట్‌ సీడ్‌ (తాలు, ఇతర విత్తనాలు) అనే రెండుగా విడగొడుతాయి. తాలు, నాణ్యత లేని విత్తనాలను దళారులు దాణా పేరుతో కొనుగోలు చేసి ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేస్తారు. తక్కువ ధర పేరుతో రైతులకు అమ్ముతున్నారు.

తనిఖీలంటే ఇలాగేనా?

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 6.36 లక్షల హెక్టార్లు కాగా ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీనికి తగ్గట్టు ధ్రువీకరణ కంపెనీల వద్ద రైతుల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను సరఫరా చేయలేకపోతున్నారు. మరోవైపు పలువురు రైతులు నిరక్షరాస్యులవడం, వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు వ్యవసాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఏడీఏ గోపాల్‌, ఏవో సురేష్‌ బృందం జిల్లాలో నంద్యాల పరిధిలోని విత్తన ప్రొసెసింగ్‌ యూనిట్లను తనిఖీ చేసింది. హెచ్‌టీ పరీక్షకు సంబంధించి 25 నమూనాలను సేకరించగా అన్నీ నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. మరోవైపు జిల్లా వ్యవసాయాధికారులు సైతం ఏప్రిల్‌ నెలలో పత్తి విత్తన ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ యూనిట్లను తనిఖీ చేసేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ తిరిగినా ఆమ్యామ్యాల కారణంగా లోపాలను ఎత్తిచూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటివి ఎన్నో...

దొర్నిపాడు మండల కేంద్రానికి చెందిన రామశేషయ్య నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా భీమవరంలో 160 కిలోల నకిలీ విత్తనాలను సమ్మయ్య అనే రైతుకు అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.2.70 లక్షలుగా గుర్తించారు. ● జిల్లాలో గతేడాది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించగా రూ.2.50 కోట్ల విలువ చేసే నిషేధిత పత్తి విత్తనాలు (హెచ్‌టీ) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

హెచ్‌టీ పత్తి విత్తనాలతో...

కలుపు మందు తట్టుకునే రకం హెచ్‌టీ కాటన్‌. ఇది నిషిద్ధ విత్తనం. జిల్లాలో నంద్యాల, ఆదోని, కర్నూలు కేంద్రంగా ఈ హెచ్‌టీ పత్తి విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు, తెలంగాణ రాష్ట్రం గద్వాల, మహబూబ్‌నగర్‌ నుంచి జిల్లాకు కల్తీ విత్తనాలు చేరుతున్నాయి. నంద్యాల పరిధిలో వేసే కమర్షియల్‌ పత్తి విత్తనాలను కొందరు అక్రమార్కులు రైతుల నుంచి కొనుగోలు చేసి నకిలీ ప్యాకెట్లలో కలిపేందుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. జూన్‌ 15 నుంచి పొలాల్లో విత్తనాలు వేస్తారు.

అర కోటికిపైగా భారమే

జిల్లాలో 2020 ఖరీఫ్‌లో 2,76,643 హెక్టార్లలో పత్తి సాగైంది. ఈ ఏడాది 2,49,068 హెక్టార్లు సాధారణ సాగుగా వ్యవసాయాధికారులు నిర్ణయించారు. 14,45,079 ప్యాకెట్ల బీటీ పత్తి విత్తనాలు అవసరమని విత్తన పంపిణీ ప్రణాళికలో గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపారు. కేంద్ర ప్రభుత్వం బీటీ విత్తనాలపై ప్యాకెట్‌కు రూ.37 పెంచడంతో రాష్ట్రంలో విత్తన ధరలు గతేడాది కంటే పెరిగాయి. బీటీ పత్తి విత్తనాలు 450 గ్రాముల బోల్‌గార్డు (బీజీ-1) ప్యాకెట్‌ ధర రూ.635, బీజీ-2 ధర రూ.767 ధరగా ప్రైవేటు కంపెనీలకు వ్యవసాయశాఖ కమిషనర్‌ నిర్ణయించారు. దీంతో పెరిగిన పత్తి విత్తన ధరలతో జిల్లా రైతులపై రూ.53.46 లక్షలపైగా అదనపు భారం పడుతోంది.

నమూనాలను ల్యాబ్‌కు పంపాం

పత్తి విత్తన ప్రాసెసింగ్‌ను మాత్రమే జిల్లాలోని ప్లాంట్లలో చేపట్టారు. ప్యాకింగ్‌ అంతా తెలంగాణ రాష్ట్రంలోని ఆయా కంపెనీలు చేయించాయి. పత్తి విత్తన ప్యాకెట్లు ప్రస్తుతం విపణిలోకి వచ్చాయి. వ్యవసాయాధికారులతో శాంపిల్స్‌ తీయించి గుంటూరులోని డీ కోడింగ్‌ ల్యాబ్‌కు పంపుతున్నాం. పత్తి విత్తన ప్యాకెట్ల నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తున్నాం. గత నెలలో ప్రత్యేక బృందాలతో జిల్లాలోని పత్తి విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపాం. హెచ్‌టీ బీటీ పత్తి విత్తనాలుగా నిర్ధారణ అయితే సదరు కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటాం. - ఉమామహేశ్వరమ్మ, జేడీఏ

ఇదీ చూడండి.

రహస్య ప్రాంతంలోనే ఆనందయ్య.. రేపే తుది నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.