కర్నూలు జిల్లా వెల్దుర్తిలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు అధికారులు పట్టుకున్నారు. వెల్దుర్తిలో ఓ వ్యాపారి తన ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు BT3 రకం తయారు చేసి రైతులకు అమ్ముతున్నాడు. వీటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. మూడు సంవత్సరాలుగా ఈ వ్యాపారి నకిలీ విత్తనాలు తయారీ చేస్తున్నాడని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. వీటి విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. విత్తనాలు పావని అనే పేరు పైన అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాల తయారీ యంత్రం, రసాయనాలు, ప్యాకింగ్ యంత్రం స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండీ :