ETV Bharat / state

'సెప్టెంబర్ నాటికి తగ్గుముఖం పట్టునున్న కొవిడ్ కేసులు'

కరోనా పరీక్షలు చేసేందుకు... రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నట్లు రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ నెల నుంచి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని... అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెబుతున్న ఏపీ కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి

face to face interview with andhrapradesh covid control center officer about corona

author img

By

Published : Jul 29, 2020, 12:35 PM IST

Updated : Jul 29, 2020, 4:32 PM IST

కరోనా పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి

ప్రశ్న: రాష్ట్రంలో లక్షకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ పాజిటివ్ కేసులు ఎంత కాలం ఇలా పెరిగే అవకాశముంది ?

జవాబు: కేసులు పెరిగినప్పుడు ఆందోళన కలగటం సహజం. ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కావున ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పుడు డబ్లింగ్ టైమ్ తగ్గటంతో కేసులు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఎక్కువగా రికార్డు కావడం కూడా మంచిదే. వారిని గుర్తించటం కటైన్మెంట్ చేసి వ్యాప్తిని అరికట్టగలం.

ప్రశ్న: ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కాబట్టి కేసులు సంఖ్య పెరుగుతున్నాయంటున్నారు? ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ?

జవాబు: ఆగస్టులో పెరిగి సెప్టంబర్‌ నుంచి డౌన్ ఫాల్ అవుతాయి. ప్రజలు ఎవ్వరూ భౌతిక దూరం పాటించటం లేదు. మాస్కులు, శానిటైజర్ వాడటం లేదు. వచ్చినా మాకు ఏమవుతుందిలే అని యువత పెద్దలకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. తప్పకుండా మాస్కులు పెట్టుకొవాలని గుర్తించినప్పుడే కరోనా వ్యాప్తిని అరికట్టగలం.

ప్రశ్న: ఐసీఎంఆర్ గైడ్‌ లైన్స్ ప్రకారం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి పరీక్షలు చేయించుకోవచ్చు ?

జవాబు: రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడేట్ ఆసుపత్రి, ఎన్‌ఏబీఎల్ ల్యాబ్స్, కొన్ని పెద్ద ల్యాబుల్లో యాంటిజన్ టెస్టు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాం. వీరు ఆరోగ్యశ్రీ సీఈవోకు అప్లికేషన్‌ పెట్టుకోవాలి. దీనికి ధర 750 రూపాయలు నిర్ణయించాం. యాంటిజన్ టెస్టులో నెగటివ్ వస్తే అదే శాంపిల్‌ను వీఆర్డీఎల్ ల్యాబ్‌కు పంపి ఆర్టీపీసీఆర్ చేయించాలి దీనికి 2800 రూపాయలు నిర్ణయించాం.

ప్రశ్న: యాంటిజన్ టెస్టులో రాకపోతే ఆర్టీపీసీఆర్‌కు వెళ్లాలన్నారు. రెండు టెస్టుల భారం రోగి భరించాలా ?

జవాబు: యాంటిజన్ టెస్టుకు 60 శాతం సెన్సిటివిటి ఉంది. ఆర్టీపీసీఆర్ టెస్టుకు 70 శాతం ఉంది. అత్యవరసం అన్నప్పుడు యాంటిజన్ టెస్టు చేయాలి. కొద్దిగా ఆలస్యం అయినా ఇబ్బంది లేనప్పుడు ఆర్టీపీసీఆర్ చేయాలి. ఈ రెండు పరీక్షలు నుంచి తప్పించుకునే పరిస్థితి తక్కువగా ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సీటీ స్కాన్ చేయించుకున్నా మరలా ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి. యాంటిజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఖచ్చితంగా కోవిడ్ ఉందా లేదా అని చెబుతాయి.

ప్రశ్న: ఎక్స్‌రే ద్వారా కూడా నిర్ధారించవచ్చా ?

జవాబు: ఎక్స్‌రే ద్వారా కూడా నిర్ధారించవచ్చు. అనుమానం ఉన్నప్పుడు ఎక్స్‌రే చేయించుకోవచ్చు. లక్షణాలు ఉంటే యాంటిజన్ టెస్టు చేసుకోవాలి యాంటిజన్ పరీక్షలో నెగటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి.

ప్రశ్న: కరోనా వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చారా..? ఇచ్చే అవకాశముందా ?

జవాబు: ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యానికి అనుమతులు ఇచ్చాం. అన్నీ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో కేసులు స్వీకరించాలని చెప్పాము. ఈ ఆసుప్రతులకు ధర కూడా నిర్ణయించాం. మైల్డ్ ఎసింప్టమస్ కేసులకు రోజుకు 3250 రూపాయలు, ఆక్సిజన్ పెట్టే కేసులకు రోజుకు 5000 రూపాయలు, వెంటిలేటర్ కేసులకు పది వేల రూపాయలు రోజుకు అని నిర్ణయించాము.

ప్రశ్న: ఎలాంటి కండిషన్స్‌లో కరోనా వ్యాపిస్తుంది ?

జవాబు: వాతావరణం మారటం వల్ల మిగతా వ్యాధులు వ్యాప్తించే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి భయపడకండి. ఎక్కువ మంది ఆందోళనతోనే చనిపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కల్పించింది. మీకు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలి.

ప్రశ్న: మరణాలు ఎందుకు ఎక్కువ సంభవిస్తున్నాయి ?

జవాబు: ఇతర వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా మరణిస్తున్నారు. కొన్ని కేసుల్లో గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన ఇండియాలో 1.25 శాతం మాత్రమే డెత్ రేటు ఉంది. ఇంత కంటే తక్కువ ఉండే అవకాశముంది. ఎక్కువ భయపడాల్సిన పని లేదు.

ప్రశ్న: భయంతో చాలా మంది చనిపోతున్నారు. మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఏం చెబుతారు ?

జవాబు: భయం, వివక్ష, ఆందోళన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ మూడింటిని విడనాడాలి. సైటింఫిక్ నాలెడ్జితో ముందుకెళ్తే ఈ కరోనా నుంచి బయటపడతాం.

ఇదీ చూడండి

3 నెలల తర్వాత కరోనా ఫలితం.. ఇప్పుడు క్వారంటైన్​కు రమ్మంటే ఎలా..?

Last Updated : Jul 29, 2020, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.