ప్రభుత్వం మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తుండగా... అక్రమార్కులు జోరుగా మద్యం దందా సాగిస్తున్నారు. ప్రభుత్వం మద్యాన్ని దశలవారీగా తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వమే దుకాణాలు ప్రారంభించి... మద్యాన్ని విక్రయిస్తుంది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు మద్యం వ్యాపారం చేసేందుకు కర్ణాటక ప్రాంతం నుంచి నాణ్యత లేని మద్యం తరలిస్తూ... అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఆస్పరి, ఆలూరు ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో 1200 మద్యం సీసాలను తరలిస్తున్నారన్న సమాచారంతో... కర్నూలు జిల్లా పత్తికొండ ఎక్సైజ్ సీఐ మంజుల సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ రూ.96వేలు ఉంటుందని సీఐ తెలిపారు.
ఇవీ చదవండి...అప్పు చెల్లిస్తానని నమ్మించాడు... అదును చూసి చంపేశాడు