తీవ్రగాయాలతో రహదారిపై పడి ఉన్న ద్విచక్ర వాహనదారుడిని మాజీ మంత్రి అఖిలప్రియ కాపాడారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో ఉన్న 40వ జాతీయ రహదారిపై దీబగుంట్లకు చెందిన మల్లికార్జున ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిపోవటంతో తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో కర్నూలుకు వెళ్తున్న భూమా అఖిలప్రియ గాయాలతో ఉన్న వ్యక్తిని తన వాహనంలో నంద్యాలలో ఉన్న శాంతిరాం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య