ETV Bharat / state

BHUMA AKHILA PRIYA: 'కావాలనే తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు'

author img

By

Published : Jul 8, 2021, 8:25 PM IST

తమపై కావాలనే కొందరు పోలీసులను అడ్డం పెట్టుకుని హైదరాబాద్​లో అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. ఈ విషయంపై... ఆధారాలతో సహా తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

BHUMA AKHILA PRIYA
కావాలనే తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు

హైదరాబాద్​లోని తన తండ్రి ఆస్తుల కోసం పోరాటం చేస్తున్న తమపై తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్ర మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా.. ఐడెంటిఫికేషన్ కోసం కోర్టుకు రాకుండా తప్పుడు కోవిడ్ రిపోర్టు పెట్టారన్న ఆరోపణలతో.. తన భర్త, తమ్ముడిపై కేసులు పెట్టారని అన్నారు.

గత ఆరు నెలల్లో రెండు సార్లు భార్గవరామ్ నాయుడు కోర్టుకు వెళ్లినట్లు ఆమె తెలిపారు. కొంతమంది వ్యక్తులు పోలీసులను అడ్డుపెట్టుకుని కావాలనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులు తమను ఏ విధంగా వేధిస్తున్నారో.. ఆధారాలతో సహా తెలంగాణ సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు లేఖలు రాస్తానన్నారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని.. తమ ఆస్తుల కోసం పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

SNAKE BITE: పాము కాటుకు.. బలైన ఆశీర్వాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.