కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగలదిన్నె వద్ద తుంగభద్ర నదిపై రాయలసీమ-తెలంగాణ మధ్య అనుసంధానంగా నిర్మిస్తున్న వంతెనను తెదేపా నేత.. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పరిశీలించారు.
2009 సంవత్సరంలో తుంగభద్ర వరదలకు వంతెన కొట్టుకుపోగా.. 2012లో రూ.42కోట్లను తమ హయాంలో మంజూరు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సమస్యగా ఉన్న రెండు ఎకరాల భూసేకరణను తెలంగాణ ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలిపారు. వంతెన నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణ పూర్తి కావడంతో వంతెన పూర్తికి అడ్డంకి తొలగిందన్నారు.
ఇదీ చదవండి; 'వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీలు'