కర్నూలు జిల్లా మంత్రాలయంలో పంచాయతీ సర్పంచి అభ్యర్థి వడ్డే నారాయణపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. మంత్రాలయం మేజర్ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు. ప్రచారంలో భాగంగా.. తన కరపత్రంలో పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి చిత్రంతో పాటు పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల చిత్రాలను ముద్రించారు.
విషయం తెలుసుకున్న రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ వెంకటేష్ జోషి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా కరపత్రాల్లో రెండు చిత్రాలు ముద్రించారని .. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ చేసి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి నట్లు ఎస్సై వేణుగోపాల్ రాజు తెలిపారు.
ఇదీ చూడండి: