కర్నూలు జిల్లాలో ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని జ్యోతి మాల్లో బేస్త గంగపుత్ర కులస్థుల వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో యువతీ యువకులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
విశాఖలోనూ...
ఈనాడు పెళ్లిపందిరి ఆధ్వర్యంలో యాదవ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం విశాఖలో జరిగింది. వైశాఖి జల ఉద్యానవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెళ్లి కాని యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వధూవరుల వివరాలను తెలియజేశారు.
ఇదీ చూడండి: