కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున... ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ తిరుగుతూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. రెడ్ జోన్ పరిధిలోని ఇళ్లకు నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి: