శ్రీశైలం పరిధిలో రాత్రివేళలో డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయన్న స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో దేవస్థానం సెక్యూరిటీ, అటవీశాఖ సిబ్బంది పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సంచారంపై ఆరా తీస్తున్నారు.
ఈ మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు. అవి అసలు డ్రోన్లా..కాదా తేల్చాలని కోరామని.. స్థానికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈవో సూచించారు.
తాజాగా జమ్ములోని భారత వైమానిక దళానికి చెందిన ఓ స్థావరంపై డ్రోన్ దాడి ఘటన తెలిసిందే. ఈ క్రమంలో డ్రోన్ల చక్కర్లు కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి..
RAILWAY BOARD:వెబ్సైట్లో 'దక్షిణ కోస్తా' జోన్.. శుభ సంకేతమంటున్న రైల్వే వర్గాలు