ETV Bharat / state

Mantralayam Temple: రాఘవేంద్రస్వామికి రూ.20 కోట్ల విలువైన గిన్నెల సమర్పణ - మంత్రాలయం రాఘవేంద్రస్వామి వార్తలు

Mantralayam raghavendra swamy temple
Mantralayam raghavendra swamy temple
author img

By

Published : Aug 24, 2021, 10:11 AM IST

Updated : Aug 24, 2021, 2:34 PM IST

10:05 August 24

Mantralayam raghavendra swamy temple

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి 14 కిలోల బంగారంతో రూపొందించిన అభిషేకం గిన్నెలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు సమర్పించారు. రూ.కోటి విలువైన చామర్లు అందజేశారు. 350వ ఆరాధనోత్సవాల సందర్భంగా.. మూడో రోజు పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా.. తనకు పాదకానుకల రూపంలో వచ్చిన 17 కిలోల బంగారాన్ని కరిగించి.. ఈ గిన్నెలు, చామర్లు తయారు చేయించి.. స్వామివారికి సమర్పించుకున్నారు.

ఈ గిన్నెలు, చామర్ల విలువ సుమారు 20 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. భక్తుల విరాళాలు, మఠాధిపతి పాద కానుకలతోనే వీటిని తయారు చేయించినట్టు వెల్లడించారు. మరోవైపు.. ఉత్సవాల్లో భాగంగా తితిదే తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాఘవేంద్రుని మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:

Corona Cases: దేశంలో కొత్తగా 25,467మందికి వైరస్

Last Updated : Aug 24, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.