కర్నూలు జిల్లాలో వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్యులపై జరగుతున్న దాడులకు వ్యతిరేకంగా కర్నూలు వైద్య కళాశాలలో జూనియర్ వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల సమావేశ మందిరంలో వైద్యులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కొవిడ్ సమయంలో తమ ప్రాణాలకు తెగించి వైద్యులు సేవలందించారని ఎంపీ సంజీవ్ కుమార్ కొనియాడారు. వైద్యులపై దాడులకు పాల్పడటం సరికాదని.., ఎక్కడైనా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనాకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.., మన దేశంలో మరణాల రేటు 1 శాతం కన్నా తక్కువనే ఉందన్నారు. ప్రభుత్వాసుత్రిలో ఉన్నన్ని వసతులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉండవని అన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందాలని సూచించారు.
ఇదీ చదవండి