నంద్యాల కేసులో పోలీసులకు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నంద్యాల మూడో ఆదనపు జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: